PV Sindhu: పీవీ సింధుకు షాకింగ్ మేసేజ్... ఆపై ఊరట!

  • ఇకపై స్పాన్సర్ షిప్ ఉండదు
  • యోనెక్స్ నుంచి మేసేజ్
  • ఆపై తమ ఖాతా హ్యాక్ అయిందని వివరణ
  • సింధును క్షమాపణలు కోరిన యోనెక్స్

భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధుకు, తన అధికారిక స్పాన్సరర్ యోనెక్స్ నుంచి వచ్చిన మెసేజ్  షాక్ కు గురయ్యేలా చేయగా, ఆపై కాసేపటికి, అసలు విషయం తెలిసి ఊరట చెందింది. "గుడ్‌ బై సింధు.  ఇండియా వంటి పేద దేశానికి చెందిన ఆటగాళ్లు ఇక మా స్పాన్సర్‌ షిప్‌ పొందబోరు. ఇక మా దృష్టంతా జపాన్‌ యువ క్రీడాకారులపైనే" అన్నది యోనెక్స్ నుంచి సింధుకు వచ్చిన మెసేజ్.

దాంతో అవాక్కైన సింధు, నిజానిజాలను తెలుసుకునే ప్రయత్నాల్లో ఉండగానే, మరో మెసేజ్ వచ్చింది. తమ మెసేజ్ ఖాతాను గుర్తు తెలియని వ్యక్తులు హ్యాక్ చేశారని, దాని ఫలితమే ఈ మెసేజ్ అని స్పష్టం చేసింది. తమ ఇన్ స్టాగ్రామ్ ఖాతా నుంచి తమకు తెలియకుండానే పోస్టులు వెళ్లాయని చెబుతూ, సింధుకు క్షమాపణలు చెప్పింది. ఇకపై ఇలా జరుగకుండా చూసుకుంటామని యోనెక్స్ చెప్పడంతో సింధు ఊపిరి పీల్చుకుంది.

PV Sindhu
Badminton
Yonex
Instagram
  • Loading...

More Telugu News