Srinagar: బ్రేకింగ్ న్యూస్... భారీగా ఆయుధాలతో సీఆర్పీఎఫ్ క్యాంపులోకి ప్రవేశించిన ఉగ్రవాదులు!

  • పాక్ ఉగ్రవాదుల మరో పన్నాగం
  • శ్రీనగర్ లోని సైనిక క్యాంపులో టెర్రరిస్టులు
  • ఉదయం నుంచి కూంబింగ్
  • ఇంకా పట్టుబడని ఉగ్రవాదులు

నిన్నటి సుంజ్వాన్ ఘటనను మరచిపోకముందే పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు మరో పన్నాగం పన్నారు. సరిహద్దులు దాటి వచ్చిన ఇద్దరు ఉగ్రవాదులు శ్రీనగర్ లోని సీఆర్పీఎఫ్ (సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్) క్యాంపులోకి భారీ ఎత్తున ఆయుధాలతో జొరబడ్డారు. ఈ విషయాన్ని తెలుసుకున్న సైనికులు, ఆ ప్రాంతాన్నంతా తమ అధీనంలోకి తీసుకుని కూంబింగ్ ప్రారంభించారు.

ఈ ఉదయం నుంచి కూంబింగ్ జరుగుతుండగా, ఇప్పటివరకూ ఉగ్రవాదులు పట్టుబడలేదు. వీరి వద్ద ఏకే-47 గన్స్, పెద్ద పెద్ద బ్యాగులు ఉన్నాయని తెలుస్తోంది. సైనిక క్యాంపుపై దాడి చేసే ఉద్దేశంతోనే వీరు వచ్చుంటారని అధికారులు భావిస్తున్నారు. సీఆర్పీఎఫ్ క్యాంపులోకి ఉగ్రవాదులు జొరబడిన ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సివుంది. మరోవైపు సుంజ్వాన్ ఆర్మీ క్యాంపులో కూడా కూంబింగ్ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి.

Srinagar
Pakistan
Terrorists
CRPF
AK-47
  • Loading...

More Telugu News