Pawan Kalyan: పార్లమెంటులో టీడీపీ ఎంపీల నిరసనలు డ్రామాలని నేనెలా చెప్పగలను?: పవన్ కల్యాణ్

  • సీఎం చంద్రబాబుకే మోదీ అపాయింట్ మెంట్ దొరకట్లేదట
  • ఇంకా, నాకు అపాయింట్ మెంట్ ఇవ్వమని నేనెలా అడుగుతా? 
  • తెలంగాణకు జరగాల్సిన న్యాయం జరిగింది
  • మీడియాతో జనసేన అధినేత పవన్ కల్యాణ్

ఏపీకి న్యాయం చేయాలంటూ పార్లమెంట్ లో టీడీపీ ఎంపీలు చేస్తున్న నిరసనలు డ్రామాలని తాను ఎలా చెప్పగలనని, అసలు ఎంపీల మనసుల్లో ఏముందో తనకు తెలియదని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ మీడియా అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. హైదరాబాద్ లోని జనసేన పార్టీ కార్యాలయంలో ప్రముఖ రాజకీయవేత్త ఉండవల్లి అరుణ్ కుమార్ తో భేటీ అనంతరం, ఆయన మీడియాతో మాట్లాడారు.

‘ఏపీకి జరుగుతున్న అన్యాయం విషయమై ప్రధాని నరేంద్ర మోదీని కలిసి విన్నవించొచ్చు కదా? అని పవన్ ని విలేకరులు ప్రశ్నించగా, ‘ప్రధాని నరేంద్రమోదీ అపాయింట్ మెంట్ కోసం సీఎం చంద్రబాబు 19 సార్లు ప్రయత్నించినా దొరకలేదంటుంటే, నాకు అపాయింట్ మెంట్ ఇవ్వమని మోదీని నేను ఎలా అడగగలను?’ అని ప్రశ్నించారు. ప్రత్యేక తెలంగాణ కోసం నాడు ఉద్యమించారు కనుక, ఆ రాష్ట్రం ఏర్పడిందని, తెలంగాణకు జరగాల్సిన న్యాయం జరిగిందని ఓ ప్రశ్నకు సమాధానంగా పవన్ చెప్పారు.

  • Loading...

More Telugu News