sbi: మొండి బకాయిల కింద వేల కోట్ల రూపాయల రుణాలను రద్దు చేసిన ఎస్బీఐ!

  • ఎగవేతదారుల్లో పారిశ్రామికవేత్తలు, పలువురు ప్రముఖులు
  • మొండిబకాయిలుగా సుమారు రూ.20,339 కోట్లు 
  • ఎస్బీఐ తో పాటు పలు బ్యాంకుల నుంచి తీసుకున్న 81,683 కోట్ల మొండి బకాయిలు రద్దు 

మొండి బకాయిల కింద వేల కోట్ల రూపాయల రుణాలను భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. కొంతమంది పారిశ్రామికవేత్తలతో పాటు పలువురు ప్రముఖులు ఎస్బీఐ నుంచి వేల కోట్ల రూపాయలను రుణాలుగా తీసుకున్నారు కానీ, తిరిగి చెల్లించలేదు. ఈ రుణాలను మొండి బకాయిలుగా పరిగణించిన ఎస్బీఐ వాటిని రద్దు చేసింది.

సుమారు రూ.20,339 కోట్ల రుణాలను ఎగవేతదారులు చెల్లించలేదని బ్యాంకు రద్దు చేసింది. కాగా, ఎస్బీఐతో పాటు 2016-17 ఆర్థిక సంవత్సరంలో 81,683 కోట్ల మొండి బకాయిలను ఇతర బ్యాంకులు రద్దు చేశాయి. 2016-17 ఆర్థిక సంవత్సరంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ రూ.9,205 కోట్లు, బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.7346 కోట్లు, కెనరా బ్యాంక్ రూ.5,545 కోట్లు, బ్యాంక్ ఆఫ్ బరోడా రూ.4348 కోట్ల బకాయిలను రద్దు చేశాయి.

sbi
  • Loading...

More Telugu News