Harish Rao: తిరుమలలో తెలంగాణ మంత్రి హరీశ్ రావు... స్వాగతం పలికిన అధికారులు

  • ఆదివారం ఉదయం తిరుమలలో హరీశ్ రావు
  • వేదాశీర్వచనం పలికిన పండితులు
  • తెలుగు ప్రజల గురించి ప్రార్థించానన్న హరీశ్ రావు

తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు ఈ ఉదయం తిరుమలకు వచ్చి శ్రీ వెంకటేశ్వరుని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఆలయం వద్దకు హరీశ్ రావు రాగా, టీటీడీ అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శనం చేయించారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపం వద్ద వేదాశీర్వచనం పలికిన పండితులు, స్వామివారి శేషవస్త్రంతో ఆయన్ను సత్కరించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు ఆయనకు అందించారు. దర్శనానంతరం బయటకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ, స్వామివారి అనుగ్రహంతో రెండు తెలుగు రాష్ట్రాలూ అభివృద్ధి చెందుతున్నాయని అన్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖ సంపదలతో సుభిక్షంగా ఉండాలని తాను దేవుడిని ప్రార్థించానని పేర్కొన్నారు.

Harish Rao
Tirumala
TTD
Telugu States
  • Loading...

More Telugu News