Pawan Kalyan: నితిన్ సినిమా 'చల్ మోహన్ రంగ' ఫస్ట్ లుక్ ఇదే!

  • పవన్, త్రివిక్రమ్ నిర్మాతలుగా ఉన్న చిత్రంలో నితిన్ హీరో
  • 'చల్ మోహన్ రంగ' అన్న పేరు ఖరారు
  • విడుదలైన ఫస్ట్ లుక్

హీరో నితిన్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు ఎంత పెద్ద అభిమానో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక తన అభిమాన హీరో నిర్మాతగా ఓ చిత్రాన్ని నిర్మిస్తుంటే, అందులో తాను నటించిన అదృష్టాన్ని కొట్టేశాడు నితిన్. పవన్ నిర్మాతగా మారి త్రివిక్రమ్ శ్రీనివాస్ ను మరో నిర్మాతగా పెట్టుకుని కృష్ణ చైతన్య దర్శకత్వంలో తీసిన చిత్రానికి 'చల్ మోహన్ రంగ' అన్న పేరును ఖరారు చేసి ఫస్ట్ లుక్ ను ఆదివారం నాడు విడుదల చేశారు.

ఈ ఫస్ట్ లుక్ లు నితిన్, హీరోయిన్ మేఘా ఆకాశ్ గంతులేస్తూ కనిపిస్తున్నారు. 'లై' తరువాత వీరిద్దరూ కలసి నటిస్తున్న చిత్రం ఇదే. పీకే క్రియేటివ్‌ వర్క్స్‌, శ్రేష్ఠ్‌ మూవీస్‌ బ్యానర్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. దీంతో పాటు 14 సంవత్సరాల తరువాత తాను హీరోగా దిల్ రాజు 'శ్రీనివాస కల్యాణం' అన్న పేరుతో సినిమాను తీస్తుండగా, నితిన్ ఆ చిత్రం షూటింగ్ లోనూ పాల్గొంటున్నారు.

Pawan Kalyan
Trivikram Srinivas
Nitin
Chal Mohan Ranga
  • Loading...

More Telugu News