Syed Salahuddin: సైనిక అధికారుల ఇళ్లపై దాడి వెనుక మాస్టర్ మైండ్స్ వీరే!

  • హిజ్బుల్ ముజాహిద్దీన్ చీఫ్ సయ్యద్ సలాఉద్దీన్, జైషే మొహమ్మద్ చీఫ్ మసూద్ అజర్
  • దాడికి ముందు మాట్లాడుకున్న ఇద్దరు ఉగ్రనేతలు
  • వెల్లడించిన నిఘా వర్గాలు

జమ్మూ కశ్మీర్ లో సైనికాధికారుల కుటుంబాలపై దాడి జరిపిన ఉగ్రవాదుల వెనుక హిజ్బుల్ ముజాహిద్దీన్ చీఫ్ సయ్యద్ సలాఉద్దీన్, జైషే మొహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ ఉన్నారని నిఘా వర్గాలు తేల్చాయి. నిన్న తెల్లవారుజాము నుంచి జరుగుతున్న ఎన్ కౌంటర్ ఈ ఉదయం వరకూ కొనసాగింది. మొత్తం ముగ్గురు ఉగ్రవాదులు పాకిస్థాన్ లో శిక్షణ పొంది ఇక్కడికి వచ్చారని, వీరు రావడానికి ముందు సలాఉద్దీన్, మసూద్ అజర్ లు మాట్లాడుకున్నారని కూడా నిఘా వర్గాలు పసిగట్టారు.

ముజఫరాబాద్ లో రెండు గ్రూపులూ కలసి ఓ టెర్రరిస్టు క్యాంపును నిర్వహించి, ఉగ్రవాదులకు శిక్షఇ ఇచ్చి పంపారని వెల్లడించాయి. వీరు ఏకే-47 తుపాకులు, ఇతర ఆయుధాలు తీసుకుని వచ్చారని, ఎన్ కౌంటర్ అనంతరం ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని అధికారులు వెల్లడించారు. వారి వద్ద లభించిన వస్తువులను పరిశీలించిన తరువాత వారు జైషే మొహమ్మద్ కు చెందిన వారని ఖరారైందని తెలిపారు. ఈ ఘటనలో ఇద్దరు మరణించగా, మరో 9 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని రక్షణ శాఖ ప్రజా సంబంధాల అధికారి ఒకరు వెల్లడించారు.

Syed Salahuddin
Masood Azhar
Sunjwan Army camp
Attack
Masterminds
  • Loading...

More Telugu News