Gold Mine: రాజస్థాన్ లో వెలుగులోకి వచ్చిన 11 కోట్ల టన్నుల బంగారు గని!

  • ఉపరితలానికి 300 అడుగుల లోతునే గనులు
  • రాగి, సీసం, జింక్ గనులు కూడా ఉన్నాయి
  • జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా స్పష్టీకరణ

రాజస్థాన్ లో భారీ బంగారు నిక్షేపాలున్నాయని భూ భౌతిక శాస్త్రవేత్తలు గుర్తించారు. ఉపరితలానికి కేవలం 300 అడుగుల లోతులోనే ఇవి ఉన్నాయని జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (జీఎస్‌ఐ) అధికారులు స్పష్టం చేశారు. బన్ స్వారా, ఉదయ్ పూర్ నగరాల మధ్య ఇవి ఉన్నాయని, ఇతర ప్రాంతాల్లోనూ బంగారం నిక్షిప్తమై ఉందని జీఎస్ఐ డైరెక్టర్ జనరల్ ఎన్.కుటుంబరావు వెల్లడించారు.

మొత్తం 11.84 కోట్ల టన్నుల మేరకు బంగారం నిల్వలు ఈ గనుల్లో ఉండి ఉండవచ్చని ఆయన అంచనా వేశారు. ఇతర ప్రాంతాల్లో ఉన్న గనులను పరిశీలిస్తున్నామని, సికర్, నీమ్ కా థాన్ ప్రాంతాల్లో బంగారం గనులను అంచనా వేసే పనిలో ఉన్నామని అన్నారు. రాజ్ పురా - దరీబా పట్టణాల మధ్య 35 కోట్ల టన్నుల జింక్, సీసం ఉన్నట్టు కనుగొన్నామని, 8 కోట్ల టన్నుల రాగి నిల్వలను సైతం గుర్తించామని తెలిపారు.

Gold Mine
Rajasthan
GSI
  • Loading...

More Telugu News