Chandrababu: నెక్ట్స్ స్టెప్ ఏంటి?: ఎంపీలను కోరిన చంద్రబాబు

  • అమరావతిలో ఎంపీలతో సమావేశమైన చంద్రబాబు 
  • కేంద్రంపై మరింతగా ఒత్తిడి తేవాలని ఆదేశం
  • సమస్యను జాతీయ స్థాయికి తీసుకెళ్లామన్న బాబు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చిన విభజన హామీలను వెంటనే నెరవేర్చే దిశగా కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు తదుపరి తీసుకోవాల్సిన చర్యలపై చంద్రబాబునాయుడు పార్లమెంట్ సభ్యులను సలహా అడిగారు. ఈ ఉదయం ఎంపీలతో సమావేశమైన ఆయన, బడ్జెట్ తొలి విడత సమావేశాల్లో రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందన్న విషయాన్ని జాతీయ స్థాయిలో గొంతెత్తి చాటామని, అదే స్ఫూర్తితో తదుపరి సమావేశాల్లోనూ నిరసనలు తెలిపి, డిమాండ్లను సాధించుకురావాలని పిలుపునిచ్చారు.

విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ కు కేంద్రం సానుకూల సంకేతాలు పంపిందన్న విషయాన్ని ఓ ఎంపీ ప్రస్తావించగా, అధికారిక ప్రకటన వచ్చేంత వరకూ నమ్మలేమని కొందరు ఎంపీలు వ్యాఖ్యానించారు. జోన్, హోదాకు బదులుగా ఇస్తామన్న ప్యాకేజీ, విద్యాసంస్థలు, రాజధానికి నిధులు తదితర విషయాలపైనా ఎంపీలు చంద్రబాబుతో చర్చించారు. ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండాలని ఆదేశించిన చంద్రబాబు, కేంద్ర మంత్రులను ఎప్పటికప్పుడు కలసి, వారితో సమస్యల గురించి మాట్లాడుతుండాలని డిమాండ్ల సాధనకు కృషి చేయాలని సూచించారు.

  • Loading...

More Telugu News