Hyderabad: హైదరాబాద్ లో అదృశ్యమైన విద్యార్థినుల ఆచూకీ?

  • నారాయణగూడ రెడ్డి కాలేజీలో వేర్వేరు ఘటనలు
  • కాలేజీకి వచ్చి మాయమైన దివ్య, చామంతి
  • ఆచూకీ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామన్న పోలీసులు

హైదరాబాద్ లోని నారాయణగూడలో ఆర్బీవీఆర్ రెడ్డి కాలేజీలో డిగ్రీ చదువుతున్న ఇద్దరు అమ్మాయిలు అదృశ్యమైన ఘటన కలకలం రేపింది. ఒకే కాలేజీలో జరిగిన రెండు వేర్వేరు ఘటనలపై పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, సికింద్రాబాద్ కు చెందిన దివ్య, కొండపాక మండలానికి చెందిన చామంతి కాలేజీకి వచ్చి కనిపించకుండా పోయారు.

కాలేజీ హాస్టల్ కు వచ్చిన చామంతి 5వ తేదీ నుంచి అదృశ్యంకాగా, దివ్య శుక్రవారం సాయంత్రం కాలేజీకి వెళ్లి తిరిగి రాలేదు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నామని అన్నారు. చామంతి భూపాలపల్లి ప్రాంతంలో ఉన్నట్టు సమాచారం అందిందని, దివ్య మొబైల్ నగరం దాటి వెళ్లలేదని తెలుస్తోందని పోలీసులు వెల్లడించారు.

Hyderabad
Narayanaguda
Reddy College
Missing
Police
  • Loading...

More Telugu News