railways: అనధికారిక సెలవులో ఉన్న రైల్వే ఉద్యోగులకు ఉద్వాసన !

  • సుమారు 13 వేల మంది రైల్వే ఉద్యోగులపై పడనున్న వేటు!
  • క్రమశిక్షణా చర్యలు ప్రారంభం
  • ఓ ప్రకటన విడుదల చేసిన రైల్వేశాఖ 

రైల్వే శాఖ ఓ సంచలన నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం. చాలా కాలంగా అనధికారిక సెలవులో ఉంటున్న రైల్వే ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోనుంది. ఇందులో భాగంగా సుమారు 13 వేల మంది రైల్వే ఉద్యోగులపై వేటు పడనుంది. వీరికి త్వరలోనే విధుల నుంచి ఉద్వాసన పలకనున్నారు. ఈ నేపథ్యంలో ఇందుకు సంబంధించిన వివరాలను రైల్వే శాఖ సేకరించింది.

రైల్వేలో మొత్తం పదమూడు లక్షల మంది ఉద్యోగుల్లో 13 వేల మంది ఉద్యోగులు చాలాకాలంగా అనధికారిక సెలవులో ఉన్నట్టు గుర్తించామని, వారిపై క్రమశిక్షణా చర్యలు ప్రారంభించామని రైల్వే శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా, రైల్వే పనితీరు మెరుగు పరిచేందుకు, ఉద్యోగుల్లో నిబద్ధతను పెంచే నిమిత్తం రైల్వేశాఖ ఇటీవల ఓ డ్రైవ్ చేపట్టింది. ఈ డ్రైవ్ లో భాగంగానే రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

  • Loading...

More Telugu News