ntr: 100 రోజుల పాటు 'బిగ్ బాస్ సీజన్ 2' .. కొనసాగుతోన్న కసరత్తు

  • 'బిగ్ బాస్' ఫస్టు సీజన్ కి మంచి రెస్పాన్స్ 
  • సీజన్ 2కి సన్నాహాలు 
  • 100 రోజులు కొనసాగించాలనే నిర్ణయం

'స్టార్ మా'లో ఆ మధ్య ప్రసారమైన 'బిగ్ బాస్ షో'కి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన తీరు ఈ కార్యక్రమానికి హైలైట్ గా నిలిచింది. 70 రోజుల పాటు కొనసాగిన ఈ కార్యక్రమం ఆ ఛానల్ రేటింగ్ ను అమాంతంగా పెంచేసింది. అప్పటి నుంచి 'బిగ్ బాస్' సీజన్ 2 కోసం బుల్లితెర ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఫస్టు సీజన్ కి వచ్చిన రెస్పాన్స్ ను దృష్టిలో పెట్టుకున్న ఛానల్ వారు, సీజన్ 2కు సన్నాహాలు చేస్తున్నారట. సీజన్ 2 కి కూడా ఎన్టీఆరే వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నాడు. సీజన్ 2 .. 100 రోజుల పాటు కొనసాగించాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా సమాచారం. ఈ విధంగా చేయడం వలన టీఆర్పీ రేటింగ్స్ మరింతగా పెరుగుతాయని భావిస్తున్నారట. ఈ షోకి సంబంధించిన కసరత్తు చివరిదశకు చేరుకుందనీ .. జూన్ నుంచి ప్రసారం చేయాలనే ఆలోచనలో నిర్వాహకులు వున్నారని తెలుస్తోంది.        

ntr
  • Loading...

More Telugu News