varuntej: 'తొలిప్రేమ'తో వరుణ్ తేజ్ కి మరో హిట్ పడినట్టేనట!

  • ఈ రోజునే విడుదలైన 'తొలిప్రేమ'
  • తొలి ఆటతోనే సక్సెస్ టాక్
  • లవర్ బాయ్ గా మార్కులు కొట్టేసిన వరుణ్

మెగా ఫ్యామిలీలో ఆరడుగుల అందగాడిగా వరుణ్ తేజ్ కి మంచి క్రేజ్ వుంది. 'ఫిదా' సినిమాతో లవర్ బాయ్ గా ఆయనకి మంచి మార్కులు పడిపోయాయి. ఆ తరువాత సినిమా అయిన 'తొలిప్రేమ' ఈ రోజునే భారీస్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలోను లవర్ బాయ్ గానే కనిపించి, ఆ స్థానాన్ని ఆయన మరింత పదిలం చేసుకున్నాడని చూసినవాళ్లు అంటున్నారు.

ఈ సినిమాలో ఆదిత్య పాత్రలో వరుణ్ తేజ్ చాలా సహజంగా నటించాడని చెబుతున్నారు. ప్రేమలో పడటం .. మనస్పర్థలతో విడిపోవడం .. మానసిక వేదనను అనుభవించడం .. తిరిగి ప్రియురాలికి దగ్గర కావడం వంటి సందర్భాల్లో ఆయన మంచి పరిణతిని కనబరిచాడని అంటున్నారు. 'ఇగో' కి .. ప్రేమకి మధ్య నలిగిపోయే సన్నివేశాల్లో ఆయన నటనకు ఫిదా అయ్యామని చెబుతున్నారు. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాతో, వరుణ్ తేజ్ కి మరో హిట్ పడినట్టేననే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.        

varuntej
rasi khanna
  • Loading...

More Telugu News