sayesha saigal: విజయ్ సినిమా కోసం నన్నెవరూ అడగలేదు: సాయేషా సైగల్

  • సాయేషాకి తెలుగు .. హిందీ కలిసి రాలేదు 
  • తమిళ సినిమాలపైనే దృష్టి 
  • చేతిలో మూడు నాలుగు తమిళ సినిమాలు

'అఖిల్' సినిమాతో కథానాయికగా సాయేషా సైగల్ తెలుగు తెరకి పరిచయమైంది. ఈ సినిమా పరాజయాన్ని మూటగట్టుకోవడంతో, ఈ సుందరికి ఇక్కడ అవకాశాలు రాలేదు. ఇక హిందీలోనూ ఆమె పరిస్థితి ఆశాజనకంగా లేదు. ఈ నేపథ్యంలో తమిళ సినిమాలపై దృష్టిపెట్టిన సాయేషా, వరుస అవకాశాలను దక్కించుకుంటూ ఉండటం విశేషం.

ఈ క్రమంలోనే మురుగదాస్ - విజయ్ కాంబినేషన్లోని సినిమాలో ఆమెను హీరోయిన్ గా ఎంపిక చేశారనే ప్రచారం జరుగుతోంది. ఈ విషయాన్ని గురించి సాయేషా స్పందిస్తూ .. "విజయ్ నా అభిమాన హీరో .. ఆయనతో కలిసి నటించే ఛాన్స్ వస్తే అంతకంటే పెద్ద అదృష్టం లేదు. కానీ ఆయన సినిమా నుంచి ఎవరూ నన్ను సంప్రదించలేదు" అని చెప్పుకొచ్చింది. విజయ్ పై ఆమె కురిపించే అభిమానం చూస్తుంటే, సాయేషా అక్కడి స్టార్ హీరోల సరసన అవకాశాలను దక్కించుకోవడానికి గట్టి ప్రయత్నాలే చేస్తున్నట్టుగా అనిపించడంలేదూ!  

sayesha saigal
  • Loading...

More Telugu News