pink oneday: నేటి వన్డేలో పింక్ డ్రెస్ తో కనువిందు చేయనున్న సఫారీలు

  • జొహెన్నెస్ బర్గ్ వేదికగా జరగనున్న నాలుగో వన్డే
  • నాలుగో వన్డేను 'పింక్ వన్డే'గా పరిగణిస్తున్న సఫారీలు
  • రొమ్ము కేన్సర్ పై అవగాహన కల్గించే వన్డే పేరే 'పింక్ వన్డే'

సౌతాఫ్రికాలోని జొహెన్నెస్ బర్గ్ వేదికగా జరగనున్న నాలుగో వన్డేను సఫారీలు 'పింక్ వన్డే'గా పేర్కొంటున్నారు. రొమ్ము కేన్సర్‌ పై అవగాహన పెంచే కార్యక్రమంలో భాగంగా ఈ మ్యాచ్‌ ను ‘పింక్‌ వన్డే’గా పరిగణిస్తున్నారు. సంవత్సరంలో ఒకసారి ఈ మ్యాచ్‌ కోసం సఫారీ ఆటగాళ్లు గులాబీ దుస్తులతో బరిలోకి దిగడం సంప్రదాయం. ఈ మ్యాచ్‌ నిర్వహణ ద్వారా వచ్చే ఆదాయంలో పది లక్షల సౌతాఫ్రికా ర్యాండ్‌ లను స్థానిక చార్లొట్‌ మ్యాక్సికే అకడమిక్‌ హాస్పిటల్‌ కు విరాళంగా అందజేస్తారు. 2011 నుంచి దక్షిణాఫ్రికా ఐదు వన్డేల్లో పింక్‌ దుస్తులతో బరిలోకి దిగగా ఐదింటిలోనూ విజయం సాధించడం విశేషం. ఈ నేపథ్యంలో నేటి వన్డేపై ప్రోటీస్ ఆసక్తి వ్యక్తం చేస్తున్నారు. 

pink oneday
Cricket
south africa
  • Loading...

More Telugu News