praveen togadia: మీకు ఓటేసి గెలిపించింది రామమందిరం కోసం... ట్రిపుల్ తలాక్ కోసం కాదు!: బీజేపీపై ప్రవీణ్ తొగాడియా విమర్శలు

  • బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రవీణ్ తొగాడియా 
  • రామమందిర నిర్మాణం ఆలస్యం కావడంపై విమర్శ 
  • నిర్మాణానికి మార్గం సుగమం చేయమన్న నేత 

కేంద్రప్రభుత్వంపై వీహెచ్పీ అంతర్జాతీయ అధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. రామమందిర నిర్మాణం ఆలస్యం కావడంపై నేరుగా ఆయన బీజేపీని నిలదీశారు. ప్రజలు మిమ్మల్ని గెలిపించింది రామ మందిర నిర్మాణం కోసమేనని ఆయన స్పష్టం చేశారు. ట్రిపుల్‌ తలాక్‌ పై చట్టాలు చేయడానికి మిమ్మల్ని గెలిపించలేదని ఆయన పేర్కొన్నారు.

అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి వెంటనే మార్గం సుగమం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా, తనపై హత్యాయత్నం జరుగుతోందని ఆయన గతంలో ఆరోపణలు చేసిన నాటి నుంచి వివిధ అంశాల్లో బీజేపీపై ప్రవీణ్ తొగాడియా మండిపడుతున్న సంగతి తెలిసిందే.

praveen togadia
  • Loading...

More Telugu News