hardik pandya: సౌతాఫ్రికా ఎందుకెళ్లావు.. సెల్ఫీలు దిగడానికా?: హార్దిక్ పాండ్యకు ఝలక్ ఇచ్చిన అభిమానులు

  • సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే పాండ్య
  • ధోనీ, బుమ్రా, అక్షర్ పటేల్, షమిలతో సెల్ఫీ పోస్టు చేసిన పాండ్య
  •  పాండ్యకు సోషల్ మీడియాలో అభిమానుల చురకలు

టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యకు అభిమానులు షాక్ ఇచ్చారు. పాండ్య సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటాడు. సహచర ఆటగాళ్లతో సెల్ఫీలు దిగి, వాటిని తన సోషల్ మీడియా ఖాతాలో అప్ లోడ్ చేస్తూ అభిమానులను అలరిస్తుంటాడు. తాజాగా నాలుగో వన్డే కోసం జొహానెస్‌ బర్గ్‌ వెళ్లే సమయంలో ఎయిర్‌ పోర్టులో ధోనీ, బుమ్రా, అక్షర్ పటేల్, మహ్మద్ షమీ తదితరులతో దిగిన ఫోటోను పోస్టు చేసి, ‘కేప్‌ టౌన్‌ లో విజయం సాధించాం. మరోసారి జొహానెస్‌ బర్గ్‌ కు’ అంటూ పేర్కొన్నాడు. దీనిపై అభిమానులు మండిపడ్డారు. 'సహచర ఆటగాళ్లతో సెల్ఫీలు దిగడం మాని, ఆటపై దృష్టి పెట్టు.. పరుగులు సాధించు.. వికెట్లు తియ్.. నువ్వక్కడికెందుకెళ్లావు? సెల్ఫీలు దిగడానికా? ఆట ఆడడానికా?' అంటూ చురకలు అంటించారు. 

hardik pandya
Social Media
Twitter
team india
Cricket
  • Error fetching data: Network response was not ok

More Telugu News