KCR: ఢిల్లీ వెళ్లిన కేసీఆర్.. ప్రధానితో భేటీ?

  • సతీసమేతంగా ఢిల్లీ వెళ్లిన కేసీఆర్
  • నాలుగు రోజుల నుంచి పంటినొప్పితో బాధపడుతున్న కేసీఆర్
  • చికిత్స అనంతరం ప్రధానితో భేటీ

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ వెళ్లారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఆయన సతీసమేతంగా దేశ రాజధాని వెళ్లారు. గత నాలుగు రోజులుగా పంటినొప్పితో బాధపడుతున్న కేసీఆర్, చికిత్స నిమిత్తం ఢిల్లీ వెళ్లినట్టు తెలుస్తోంది. చికిత్స అనంతరం విదేశీ పర్యటన ముగించుకుని వచ్చే ప్రధాని నరేంద్ర మోదీతో ఆయన సమావేశమవ్వనున్నట్టు సమాచారం. ఈ సందర్భంగా రాష్ట్రానికి రావాల్సిన నిధులు, హామీల గురించి చర్చిస్తారు. అలాగే మార్చి 11న తెలంగాణలో నిర్వహించనున్న పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీకి ప్రధానిని ఆహ్వానించనున్నారు. 

KCR
New Delhi
health checkup
Prime Minister
  • Loading...

More Telugu News