ke krishnamurthy: కేంద్ర ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకుంటుంది: కేఈ కృష్ణమూర్తి
- తూర్పు గోదావరి జిల్లా అనపర్తిలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న కేఈ కృష్ణమూర్తి
- కేంద్ర ప్రభుత్వం తన తీరు మార్చుకోవాలి
- తలుపులు మూసి కాంగ్రెస్ పార్టీ ఏపీకి అన్యాయం చేసింది
- బీజేపీ తలుపు తెరచి అన్యాయం చేస్తోంది
ఇటీవల కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంటులో ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్‌కి అన్యాయం జరిగిందని అసంతృప్తితో ఉన్న ఏపీ మంత్రులు కేంద్రప్రభుత్వంపై మండిపడుతున్నారు. ఈ క్రమంలో, కేంద్ర ప్రభుత్వం చేసిన తప్పును సరిదిద్దుకుంటుందని ఆశిస్తున్నామని, తీరుని మార్చుకోకపోతే మాత్రం తగిన మూల్యం చెల్లించుకుంటుందని ఏపీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అన్నారు.
ఈ రోజు తూర్పు గోదావరి జిల్లా అనపర్తిలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ.... నిన్న లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసిన ఎంపీ గల్లా జయదేవ్‌ను అభినందిస్తున్నానని తెలిపారు. అప్పట్లో తలుపులు మూసి కాంగ్రెస్ పార్టీ ఏపీకి అన్యాయం చేస్తే, ఇప్పుడు బీజేపీ తలుపు తెరచి అన్యాయం చేస్తోందని విమర్శించారు.