rajyasabha: రాజ్యసభలో వెంకయ్యనాయుడు ఆగ్రహం!

  • రాజ్యసభలో టీడీపీ ఎంపీల ఆందోళన 
  • ఆందోళన విరమించమని కోరిన రాజ్యసభ చైర్మన్
  • పట్టించుకోకపోవడంతో ఒకింత ఆగ్రహం వ్యక్తం చేసిన వెంకయ్య 

రాజ్యసభలో ఆందోళన చేస్తున్న టీడీపీ ఎంపీల తీరుపై రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు అసహనం వ్యక్తం చేశారు. ఆందోళన విరమించమని పదే పదే ఆయన కోరినప్పటికీ, టీడీపీ ఎంపీలు పట్టించుకోకపోవడంతో వెంకయ్యనాయుడు ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ సజావుగా సాగేలా సభ్యులందరూ సహకరించాలని, సభ గౌరవం పెరిగేలా సభ్యులు వ్యవహరించాలని సూచించారు.

 దీంతో, టీడీపీ ఎంపీలు ఆందోళన విరమించి తమ స్థానాల్లో కూర్చోవడంతో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తన ప్రసంగాన్ని కొనసాగించారు. కాగా, ఈరోజు సాయంత్రం రాజ్య‌స‌భ‌లో అరుణ్ జైట్లీ చేసిన ప్రసంగంలోనూ ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు నిర్దిష్ట‌మైన హామీలు ఇవ్వ‌లేదు. నిన్న చెప్పిన అంశాలనే ఆయన మ‌ళ్లీ చెప్పడం గమనార్హం.
 

rajyasabha
Venkaiah Naidu
  • Loading...

More Telugu News