YSRCP: కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసిన విజయసాయిరెడ్డి.. టీడీపీపై ఫిర్యాదు చేసిన వైనం!

  • మా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు టీడీపీ ప్రయత్నిస్తోంది
  • ఏపీ ప్రభుత్వ చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై నిఘా పెట్టాలి
  • ప్రధాన ఎన్నికల కమిషనర్ కు విజయసాయిరెడ్డి ఫిర్యాదు

ఏపీ ప్రభుత్వం విచ్చల విడిగా అవినీతికి పాల్పడుతూ, ఆ సొమ్ముతో ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తోందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ ఓపీ రావత్ ను ఈరోజు సాయంత్రం ఆయన కలిశారు. అనంతరం, మీడియాతో విజయసాయిరెడ్డి మాట్లాడుతూ, తమ పార్టీకి చెందిన 67 మంది ఎమ్మెల్యేలలో 23 మందిని రూ.10 నుంచి రూ.20 కోట్లు ఇచ్చి టీడీపీ ప్రభుత్వం కొనుగోలు చేసిందని, మిగిలిన ఎమ్మెల్యేలలో కనీసం నలుగురిని కొనుగోలు చేసేందుకు టీడీపీ ప్రయత్నిస్తోందని రావత్ కు ఫిర్యాదు చేశానని పేర్కొన్నారు.

కేంద్ర బలగాలతో మా ఎమ్మెల్యేలకు రక్షణ కల్పించాలి

రాజ్యసభ ఎన్నికల సమయంలో పోలింగ్ బూత్ లను ఉమ్మడి రాజధాని హైదరాబాద్ లో ఏర్పాటు చేయాలని, ప్రత్యేక పరిశీలకుడిని నియమించి ఎన్నికలను పర్యవేక్షించాలని, కేంద్ర బలగాలతో తమ ఎమ్మెల్యేలకు రక్షణ కల్పించాలని, ఏపీ ప్రభుత్వ చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై నిఘా పెట్టాలని ప్రధాన ఎన్నికల కమిషనర్ ని కోరామని చెప్పారు.   

  • Loading...

More Telugu News