Andhra Pradesh: సినిమా థియేటర్లలోకి మంచినీళ్ల బాటిళ్లు తెచ్చుకుంటే అనుమతించాల్సిందే: ఏపీ మంత్రి ప్రత్తిపాటి
- షాపింగ్స్ మాల్స్, మల్టీ ఫ్లెక్స్ లలో అధిక ధరలు నియంత్రించాలి
- పెట్రోల్ బంకుల్లో మోసాలకు పాల్పడితే చర్యలు తప్పవు
- బంగారం దుకాణాల్లో దాడులు నిర్వహించి మోసాలను అరికట్టాలి
- గతంలో కంటే ఇప్పుడు మోసాలు తగ్గాయి
ప్రేక్షకులు మంచినీళ్ల బాటిళ్లు తెచ్చుకుంటే అనుమతించాల్సిందేనని ఆంధ్రప్రదేశ్ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆదేశించారు. ఈ రోజు విజయవాడలో అధికారులతో ఓ సమావేశంలో పాల్గొన్న ప్రత్తిపాటి మాట్లాడుతూ పలు సూచనలు చేశారు. సినిమా థియేటర్లలో బయటి నుంచి తెచ్చుకున్న పదార్థాలను అనుమతించరన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రేక్షకులు ఇబ్బందులు పడకుండా ఆ ఆదేశాలు జారీ చేశారు.
అలాగే, షాపింగ్స్ మాల్స్, మల్టీ ఫ్లెక్స్ లలో అధిక ధరలను నియంత్రించాల్సిందేనని చెప్పారు. కాగా, పెట్రోల్ బంకుల్లో మోసాలకు పాల్పడితే చర్యలు తప్పవని అన్నారు. బంగారం దుకాణాల్లో దాడులు నిర్వహించి మోసాలను అరికట్టాలని చెప్పారు. గతంలో కంటే ఇప్పుడు మోసాలు తగ్గాయని, అయితే పూర్తిగా అరికట్టాలని చెప్పారు.