america: భారీగా పతనమైన దేశీయ స్టాక్ మార్కెట్లు

  • 407 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • 122 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
  • ఎస్ బ్యాంక్, అరబిందో ఫార్మా..తదిర సంస్థల షేర్లకు నష్టం

ఈరోజు స్టాక్ మార్కెట్లు భారీగా పతనమయ్యాయి.  సెన్సెక్స్  407 పాయింట్లు నష్టపోయి 34,006 వద్ద, నిఫ్టీ 122 పాయింట్లు కోల్పోయి 10,455 వద్ద స్థిరపడ్డాయి. ఈరోజు ట్రేడింగ్ లో వరుస నష్టాల నుంచి తేరుకున్నాయనుకున్నప్పటికీ అమెరికా స్టాక్ మార్కెట్ల ప్రభావం కారణంగా దేశీయ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి.

 ఎన్ఎస్ఈలో ఎస్ బ్యాంక్, అరబిందో ఫార్మా,ఎస్ బీఐ, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా షేర్లు నష్టపోయాయి. హెచ్ సీఎల్ టెక్నాలజీస్, లుపిన్, ఏషియన్ పెయింట్స్, సిప్లా, టాటా స్టీల్ సంస్థల షేర్లు ఫర్వాలేదనిపించాయి. కాగా, నిన్నటి ట్రేడింగ్ లో అమెరికా మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. దీని ప్రభావం దేశీయ మార్కెట్లపై పడటంతో నిన్న కూడా నష్టాలను చవిచూసింది.
 

  • Loading...

More Telugu News