Sujana Chowdary: సుజనా చౌదరి తన పదవికి రాజీనామా చేయాలి: వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి

  • రాజీనామా చేయకుండా ప్రభుత్వాన్ని ఎలా వ్యతిరేకిస్తారు?
  • విభజన హామీల అమలుపై రాజ్యసభలో వైసీపీ ఎంపీల నిరసన
  • వెల్ లోకి దూసుకెళ్లిన విజయసాయిరెడ్డి  

కేంద్ర ప్రభుత్వానికి సుజనా చౌదరి వ్యతిరేకంగా మాట్లాడాలనుకుంటే ముందుగా తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని, రాజీనామా చేయకుండా ప్రభుత్వాన్ని ఎలా వ్యతిరేకిస్తారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు. విభజన హామీల అమలుపై వైసీపీ ఎంపీలు రాజ్యసభలో తమ పోరాటాన్ని కొనసాగిస్తున్నారు.

ఈరోజు మధ్యాహ్నం రాజ్యసభ ప్రారంభం కాగానే  వెల్ లోకి విజయసాయిరెడ్డి దూసుకెళ్లారు. ఏపీకి న్యాయం చేయాలని, విభజన హామీలు అమలు వేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రిగా ఉన్న సుజనా చౌదరి ప్రభుత్వానికి సలహాలివ్వడంలో తప్పులేదని రాజ్యసభ చైర్మన్ అన్న విషయాన్ని ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి గుర్తు చేశారు. సుజనా చౌదరి ప్రభుత్వంలో ఉన్నారో? లేదో? చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి న్యాయం జరగదని భావించినప్పుడు మంత్రి పదవులకు రాజీనామా చేయడం మంచిదని విజయసాయిరెడ్డి సూచించారు.

Sujana Chowdary
Telugudesam
YSRCP
Vijay Sai Reddy
  • Loading...

More Telugu News