lk advani: 'జైట్లీతో నేను మాట్లాడతాను'.. ఏపీ డిమాండ్లపై ఎల్‌కే అద్వానీ స్పందన

  • టీడీపీ ఎంపీలతో చెప్పిన అద్వానీ 
  • సుమారు 10 నిమిషాల పాటు ముచ్చట
  • తమ నిరసనలపై, ఏపీ పరిణామాలపై టీడీపీ ఎంపీలు వివరణ
  • సభా మర్యాదలు కాపాడాలని అద్వానీ సూచన

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఏపీకి అన్యాయం జరిగిందని టీడీపీ, వైసీపీ ఎంపీలు పార్లమెంటులో ఆందోళనలు చేస్తోన్న విషయం తెలిసిందే. దీంతో లోక్‌సభలో టీడీపీ సభ్యులతో భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత అడ్వాణీ మాట్లాడారు. సుమారు 10 నిమిషాల పాటు అద్వానీ వారితో మాట్లాడినట్లు సమాచారం.

అద్వానీకి తమ నిరసనలపైన, ఏపీ పరిణామాలపైన టీడీపీ ఎంపీలు వివరించారు. దీంతో ఆంధ్రప్రదేశ్‌కి న్యాయం చేయాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. అలాగే సభా మర్యాదలు కాపాడాలని అద్వానీ వారికి సూచించారు. ఏపీ వ్యవహారంపై తాను అరుణ్ జైట్లీతో మాట్లాడతానని చెప్పారు.

lk advani
Telugudesam
mps
Special Category Status
  • Loading...

More Telugu News