Virat Kohli: కోహ్లీకి అనుష్క తండ్రి ఇచ్చిన గిఫ్ట్ 'స్మోక్ అండ్ విస్కీ'!

  • కోహ్లీకి గిఫ్ట్ ఇచ్చిన అనుష్క తండ్రి అజయ్ కుమార్ శర్మ
  • 'స్మోక్ అండ్ విస్కీ' పుస్తకావిష్కరణలో పాల్గొన్న అజయ్ శర్మ
  • పుస్తకం చదివి ముచ్చటపడి అల్లుడికిచ్చిన అజయ్ శర్మ

గత డిసెంబర్ 11న ఇటలీలో మూడుముళ్ల బంధంతో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మ ఒక్కటైన సంగతి తెలిసిందే. వివాహానంతరం కొత్త అల్లుడికి మామగారు బహుమతి ఇవ్వడం సర్వసాధారణం. కోహ్లీకి కూడా మామగారైన రిటైర్డ్ కల్నల్ అజయ్ కుమార్ శర్మ ఊహించని గిఫ్ట్ ఇచ్చారు. 'స్మోక్ అండ్ విస్కీ' నే పుస్తకాన్ని కానుకగా ఇచ్చారు.

భార్యాభర్తల మధ్య ఉండే బంధం, ఆ క్రమంలో కలిగే ఆటుపోట్లను వివరించే 42 కవితలతో ఈ పుస్తకం సాగుతుంది. ఈ పుస్తకాన్ని ఫిబ్రవరి 3న విడుదల చేయగా, ఆ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి అజయ్ శర్మ వెళ్లారు. ఈ పుస్తకాన్ని చూసి ముచ్చటపడిన ఆయన దానిని కొనుగోలు చేసి, విరాట్ కు బహుమతిగా ఇచ్చారు. 

Virat Kohli
ajay kumar sharma
smoke and wisky
  • Loading...

More Telugu News