Pawan Kalyan: పవన్ కల్యాణ్ పై వైసీపీ ఎమ్మెల్యే బుగ్గన సెటైర్లు

  • పవన్ అజెండా ఏమిటో అర్థం కావడం లేదు
  • ఆయన ఇంకా టీడీపీలోనే ఉన్నారని భావిస్తున్నాం
  • టీడీపీ నుంచి బయటకు వస్తే ఆయన గురించి ఆలోచిస్తాం

జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెబుతున్న జేఏసీ ఏర్పడాలంటే ముందు అందులోకి టీడీపీ రావాలని వైసీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు. టీడీపీ కూటమి నుంచి పవన్ కల్యాణ్ ఇంకా బయటకు రాలేదని చెప్పారు. పవన్ కల్యాణ్ ఇంకా టీడీపీతోనే ఉన్నారని తాము భావిస్తున్నామని అన్నారు. అనంతపురంలో మంత్రి పరిటాల సునీత, ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరిల ఇళ్లకు వెళ్లి ఆతిథ్యం స్వీకరించడమే దీనికి నిదర్శనమని చెప్పారు.

జిల్లా సమస్యలను తెలుసుకోవాలంటే జిల్లా కలెక్టర్ ను కలిస్తే సరిపోతుందని, టీడీపీ నేతల ఇళ్లకు వెళ్లాల్సిన అవసరం లేదని ఎద్దేవా చేశారు. పవన్ కల్యాణ్ అజెండా ఏమిటో ఎవరికీ అర్థం కావడం లేదని అన్నారు. టీడీపీ నుంచి బయటకు వస్తే అప్పుడు పవన్ గురించి ఆలోచిస్తామని చెప్పారు. 

Pawan Kalyan
buggana rajendranath
YSRCP
Telugudesam
  • Loading...

More Telugu News