spice jet: స్పైస్ జెట్ విమానానికి తప్పిన పెను ముప్పు

  • టేకాఫ్ అవుతుండగా పేలిన టైర్
  • టైర్ పేలిన సమయంలో ఫ్లైట్ లో 199 మంది ప్రయాణికులు
  • పేలుడు ధాటికి పాడైపోయిన రన్ వే

స్పైస్ జెట్ విమానానికి పెను ప్రమాదం తప్పింది. 199 మంది ప్రయాణికులతో చెన్నై నుంచి ఢిల్లీకి బయల్దేరిన విమానం టైర్లను ముడుచుకునే హైడ్రాలిక్ సిస్టమ్ లో సాంకేతిక సమస్య ఏర్పడింది. దీంతో విమానం చెన్నై ఎయిర్ పోర్టు నుంచి టేకాఫ్ అవుతున్న సమయంలో దాని టైరు పేలిపోయింది. దీంతో అప్రమత్తమైన పైలట్ విమానాన్ని సురక్షితంగా తిరిగి చెన్నై విమానాశ్రయంలో ల్యాండ్ చేశారు.

అనంతరం టెర్మినల్ బిల్డింగ్ కు తీసుకెళ్లగా విమానం టైరును మార్చారు. కాగా, విమానం పేలుడు ధాటికి మెయిన్ రన్ వే పాడైపోయింది. దాని మరమ్మతుల కోసం మెయిన్ రన్ వేను మూడు గంటలసేపు ఆపేసి బాగుచేశారు. పెను ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు హాయిగా ఊపిరి పీల్చుకున్నారు.

spice jet
chenni
chenni air port
spice jet tyer blast
  • Loading...

More Telugu News