Renuka Chowdary: హెచ్చరించినట్టుగానే... అన్నంత పనీ చేసిన రేణుకా చౌదరి!

  • రామాయణం సీరియల్ వీడియోను పోస్టు చేసిన కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు
  • శూర్పణఖ నవ్వుతున్న వీడియోను పెట్టి, రేణుకను ప్రస్తావించిన రిజిజు
  • ఈ ఉదయం పార్లమెంట్ లో హక్కుల నోటీసులు ఇచ్చిన రేణుకా చౌదరి

ప్రధాని నరేంద్ర మోదీ తన నవ్వును రామాయణంలోని ఓ పాత్రతో పోల్చిన వేళ, ఆయన హోదాను, సభా గౌరవాన్ని కాపాడేందుకే మిన్నకున్నానని, బయట ఈ వ్యాఖ్యలు చేసుంటే తన సంగతి తెలిసేదని వ్యాఖ్యానించిన కాంగ్రెస్ ఎంపీ, రేణుకా చౌదరి... కేంద్ర మంత్రి కిరణ్ రిజిజుపై హక్కుల తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. రాజ్యసభలో తన నవ్వుపై మోదీ అన్న మాటలను ప్రస్తావిస్తూ, రామాయణం సీరియల్ లోని శూర్పణఖ నవ్వుతున్న వీడియోను కిరణ్ రిజిజు తన ఫేస్ బుక్ లో పోస్టు చేసిన సంగతి తెలిసిందే.

దీనిపై తీవ్ర విమర్శలు రాగా, ఆయన తన పోస్టును తొలగించారు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోగా, ముందుగా హెచ్చరించినట్టుగానే రేణుక అన్నంతపనీ చేశారు. ఇది ఓ మహిళను అవమానించడమేనంటూ, తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేసిన రేణుక, ఈ ఉదయం రాజ్యసభలో హక్కుల తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. రిజిజు వైఖరిపై చర్చించి, చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News