sai dharam tej: రెజీనా పర్సనల్ విషయాలపై కామెంట్ చేయను: సాయిధరమ్ తేజ్

  • రెజీనా .. నేను చాలా క్లోజ్ 
  • ఆమె ప్రేమ వ్యవహారంపై స్పందించలేను
  • అది ఆమె వ్యక్తిగత విషయం  

సాయిధరమ్ తేజ్ .. రెజీనా ప్రేమలో పడ్డారనే వార్తలు ఆ మధ్య జోరుగా షికారు చేశాయి. ఇద్దరూ కలిసి వెంటవెంటనే సినిమాలు చేయడం వలన అలాంటి పుకార్లు రావడం సహజమేననే టాక్ కూడా వినిపించింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రెజీనా మాట్లాడుతూ తాను ఓ హీరోతో ప్రేమలో పడినట్టుగా చెప్పింది. అలా ప్రేమలో పడటం వలన కొన్ని సినిమాలు వదులుకున్నాననీ .. అందువలన కెరియర్ దెబ్బతిందని అంది. ఇక నుంచి కెరియర్ పైనే దృష్టి పెట్టాలనుకుంటున్నానంటూ తన మనసులోని మాటను బయటపెట్టింది.

తాజా ఇంటర్వ్యూలో సాయిధరమ్ తేజ్ దగ్గర రెజీనా మాటలు ప్రస్తావనకు వచ్చాయి. రెజీనా మాటల పట్ల ఎలా స్పందిస్తారు? అనే ప్రశ్న ఆయనకి ఎదురైంది. దాంతో ఆయన స్పందిస్తూ .. "రెజీనా .. నేను చాలా క్లోజ్ అనే విషయం అందరికీ తెలిసిందే. అంతమాత్రాన ఆమె వ్యక్తిగత విషయాలపై నేను కామెంట్ చేయడం కరెక్ట్ కాదు. అలానే ఈ విషయంలో నా అభిప్రాయం చెప్పడం కూడా సరైనది కాదు. అంటూ సున్నితంగా ఈ విషయాన్ని కట్ చేశాడు.            

sai dharam tej
regina
  • Loading...

More Telugu News