KTR: ట్విట్టర్లో మిలియన్ ఫాలోవర్స్... 'పది లక్షల కృతజ్ఞతలు' అన్న కేటీఆర్!

  • ట్విట్టర్ లో 10 లక్షలు దాటిన కేటీఆర్ ఫాలోవర్లు
  • నమస్కార ఎమోజీని పోస్టు చేసిన యువనేత
  • 'మిలియన్ థ్యాంక్స్' అంటూ మెసేజ్

ట్విట్టర్ లో తెలంగాణ ఐటీ, మునిసిపల్, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి కల్వకుంట్ల తారకరామారావును ఫాలో అవుతున్న వారి సంఖ్య పది లక్షలు దాటింది. ఈ మైలురాయిని అందుకున్న సందర్భంగా కేటీఆర్ ఓ ప్రత్యేక మెసేజ్ ని కొద్దిసేపటి క్రితం తన ట్విట్టర్ లో పోస్టు చేశారు. నమస్కారం ఎమోజీని ఉంచిన ఆయన 'లెట్స్ స్టే కనెక్టెడ్' అంటూ పది లక్షల కృతజ్ఞతలు అని వ్యాఖ్యానించారు. మార్చి 2010లో ట్విట్టర్ ఖాతాను ఆయన ప్రారంభించిన సంగతి తెలిసిందే.

KTR
Twitter
One Million
  • Loading...

More Telugu News