Samanta: 'కావాలని కాదు గానీ, నా అవసరం' అంటూ హాట్ ఫోటో షేర్ చేసిన సమంత!

  • వివాహమైన తరువాత కూడా సినిమాల్లో బిజీగా సమంత
  • ఖాళీ సమయం దొరకడంతో రిలాక్స్ అవుతున్న మిస్సెస్ నాగచైతన్య
  • తెన్ కాశీలో బీచ్ ఒడ్డున సేదదీరుతున్న సమంత

నాగచైతన్యతో వివాహమైన తరువాత కూడా సినిమా రంగం నుంచి విరమించుకోకుండా 'రంగస్థలం', 'మహానటి' వంటి సినిమాలతో బిజీగా ఉన్న సమంత, ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ ఫోటోను పంచుకుని సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇటీవల కొంత సమయం దొరికితే, రిలాక్స్ అయ్యేందుకు తమిళనాడులోని తెన్ కాశీకి వెళ్లిన ఆమె, బికినీ ధరించి ఓ బీచ్ ఒడ్డున విశ్రాంతి తీసుకుంటున్న ఫోటోను తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసుకుంది. తాను చాలా అలసి పోయానని, ఇది సెలవు సమయమని, కావాలని కాదుగానీ, బికినీ తనకు అవసరమని చెప్పింది. సమంత బికినీ ధరించిన ఫోటో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది.

Samanta
Tenkasi
Tamilnadu
Nagachaitanya
  • Loading...

More Telugu News