ఎన్టీఆర్ ను దింపినప్పుడు చూపిన ధైర్యంలో పదో వంతును ఇప్పుడు చంద్రబాబు చూపినా మోదీ సర్కారు నాశనమే:: ఉండవల్లి
- పార్లమెంట్ లో మోదీ సర్కారుకు బలం లేదు
- చాలా మందికి మోదీపై నమ్మకం పోయింది
- రాజీనామాలకు ఇదే సరైన సమయం
- ఎన్డీయేకు మద్దతు ఉపసంహరించండి
- చంద్రబాబుకు ఉండవల్లి సలహా
రాష్ట్ర డిమాండ్లను సాధించుకునే క్రమంలో మరింత ఒత్తిడి తేవడానికి ఇదే సరైన సమయమని సూచించారు. రాజస్థాన్ లో రెండు సిట్టింగ్ ఎంపీ స్థానాలను కోల్పోయిన తరువాత బీజేపీ ముందస్తు ఎన్నికల ఆలోచనకు కూడా దూరమైందని, చంద్రబాబు తన ముందున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. వెంటనే ఎన్డీయే భాగస్వామిగా తప్పుకుని, కేంద్ర మంత్రులతో రాజీనామాలు చేయించాలని ఉండవల్లి సలహా ఇచ్చారు. ఆనాడు రాష్ట్ర విభజన సమయంలో తప్పంతా కాంగ్రెస్ దేనని చూపిస్తున్న మోదీ ప్రభుత్వంపైనా ఆయన విమర్శలు గుప్పించారు. తప్పు కాంగ్రెస్ పార్టీది అయితే, ఈ మూడున్నరేళ్లలో బీజేపీ ఏం చేసిందని ప్రశ్నించారు.