farooq abdullah: ఇక్కడ పుట్టిన ప్రతి వాడు భారతీయుడే!: ఫరూఖ్ అబ్దుల్లా

  • బీజీపీ ఎంపీ వినయ్ కటియార్ వ్యాఖ్యలపై ఫరూఖ్ అబ్దుల్లా ఆగ్రహం
  • దేశం నీయబ్బాసొత్తా? అంటూ ప్రశ్న
  • దేశం మనందరిది అంటూ హితవు

జనాభా ప్రాతిపదికన దేశాన్ని ముక్కలు చేశారని, ముస్లింలు పాకిస్థాన్ లేదా బంగ్లాదేశ్ వెళ్లిపోవాలంటూ బీజేపీ ఎంపీ వినయ్‌ కటియార్‌ చేసిన వ్యాఖ్యలపై జమ్మూకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్‌ అబ్దుల్లా మండిపడ్డారు. వినయ్ కటియార్ దేశంలో మతవిద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

ఆయన ప్రతిరోజూ ఇలాంటి వ్యాఖ్యాలు చేస్తున్నారని, ఈ దేశమేమైనా కటియార్ అబ్బసొత్తా? అని ఆయన ప్రశ్నించారు. ఈ దేశం ప్రతి భారతీయుడిదని, ఇక్కడ పుట్టి, పెరిగిన ప్రతివాడూ భారతీయుడేనని ఆయన గుర్తుచేశారు. ఏ మతమైనా ప్రతి వ్యక్తి పట్ల ప్రేమ, గౌరవాలు చూపాలని మాత్రమే బోధిస్తుందని, ఏ మతమూ విద్వేషాలు బోధించదని ఆయన స్పష్టం చేశారు. 

farooq abdullah
vinay katiyar
Jammu And Kashmir
  • Loading...

More Telugu News