parliment: టీడీపీ, వైఎస్సార్సీపీ ఎంపీల నిరసనలను టీవీల్లో చూపించొద్దు... టీవీ ఛానెల్స్ కు ఆదేశాలు!

  • పార్లమెంటు ఉభయసభల్లో వెల్ లోకి వచ్చి నిరసనలు తెలుపుతున్న ఏపీ ఎంపీలు
  • పార్లమెంటు కార్యక్రమాలను ప్రసారం చేసే లోక్ సభ టీవీ, రాజ్యసభ టీవీ
  • ఎంపీల నిరసనలను ప్రసారం చేయొద్దన్న ఉభయసభల ఉన్నతాధికారులు

పార్లమెంటులో జరిగే ప్రతి విషయాన్ని లోక్ సభ టీవీ, రాజ్యసభ టీవీ చానెల్స్ లైవ్ టెలీకాస్ట్ ద్వారా దేశప్రజలకు చూపిస్తాయన్న సంగతి తెలిసిందే. అయితే పార్లమెంటు ఉభయసభల్లో టీడీపీ సహా ఇతర పార్టీల ఎంపీలు చేసే నిరసన, ఆందోళనలు ప్రసారం చేయొద్దని లోక్‌సభ టీవీ, రాజ్యసభ టీవీ నిర్వాహకులకు ఆదేశాలు వెళ్లినట్లు సమాచారం. సభ్యులు వెల్‌ లోకి వచ్చి నిరసనలు తెలుపుతున్న దృశ్యాలను టీవీల్లో చూపించవద్దని ఉభయసభల ఉన్నతాధికారులు ఈ రెండు చానళ్ల చీఫ్‌ లను ఆదేశించినట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. 

parliment
Telugudesam
YSRCP
MPs
  • Loading...

More Telugu News