Allu Arjun: రాజ్యసభ లాబీలో కలకలం.. అరుణ్ జైట్లీ, సుజనా చౌదరి మధ్య వాగ్వివాదం

  • ఏపీకి ప్రత్యేక సాయంపై లోక్‌సభలో జైట్లీ ప్రకటనపై సుజనా మండిపాటు
  • ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలని జైట్లీని నిలదీసిన సుజనా చౌదరి
  • సాయం చేస్తామని ఇప్పటికే ప్రకటించామన్న జైట్లీ
  • డొల్ల ప్రకటనలతో ప్రజలను మోసం చేయలేరని జైట్లీతో సుజనా వాదన

ఏపీకి ప్రత్యేక సాయంపై లోక్‌సభలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ఎటువంటి నిర్దిష్ట ప్రకటన చేయని విషయం తెలిసిందే. అయితే, ఈ విషయంపై టీడీపీ నేతల నిరసనలతో రాజ్యసభ దద్దరిల్లిపోయింది. కాగా, రాజ్యసభ అర్ధగంట వాయిదా పడిన నేపథ్యంలో లాబీలో కాసేపు నిలబడిన కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీకి, సుజనా చౌదరికీ మధ్య వాగ్వివాదం జరిగినట్లు సమాచారం.

డొల్ల ప్రకటనలతో ప్రజలను మోసం చేయలేరని జైట్లీతో సుజనా వాదనకు దిగారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలని సుజనా చౌదరి అన్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ తాము అనుకున్నది సాధిస్తామని తెగేసి చెప్పినట్లు సమాచారం. దీంతో తాము ఇప్పటికే ఏపీకి సాయంపై ప్రకటన చేసినప్పటికీ ఎందుకు సంతృప్తి లేదని జైట్లీ అడిగారు. ప్రజలను మోసం చేయలేమంటూ సుజనా అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు తెలిసింది.

Allu Arjun
Sujana Chowdary
Andhra Pradesh
  • Loading...

More Telugu News