Virat Kohli: ఎప్పుడూ భారత్ పై విరుచుకుపడే మియాందాద్ కూడా కోహ్లీని పొగిడేశాడు!

  • ప్రపంచంలోనే కోహ్లీ గొప్ప బ్యాట్స్ మెన్
  • కోహ్లీ బ్యాటింగ్ టెక్నిక్స్ నాకు బాగా నచ్చుతాయి
  • బౌలర్లను అప్పటికప్పుడే అంచనా వేయగలడు

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు. దక్షిణాఫ్రికా గడ్డపై సెంచరీలతో విరుచుకుపడుతున్నాడు. నిన్న జరిగిన మూడో వన్డేలో 160 (నాటౌట్) పరుగులతో భారీ ఇన్నింగ్స్ ఆడిన కోహ్లీ ఇండియాను 3-0 ఆధిక్యతలోకి తీసుకెళ్లాడు. ఈ నేపథ్యంలో కోహ్లీపై సర్వత్ర ప్రశంసలు కురుస్తున్నాయి. చివరకు ఎప్పుడూ భారత్ పై విమర్శలు గుప్పించే పాక్ క్రికెట్ దిగ్గజం మియాందాద్ కూడా కోహ్లీపై ప్రశంసలు కురిపించాడు.

కోహ్లీ బ్యాటింగ్ టెక్నిక్స్ తనకు బాగా నచ్చుతాయని చెప్పిన మియాందాద్... బౌలర్ల బలాలు, బలహీనతలను కోహ్లీ అప్పటికప్పుడే అంచనా వేయగలడని కితాబిచ్చాడు. ప్రపంచంలోనే గొప్ప బ్యాట్స్ మెన్ కోహ్లీ అని చెప్పాడు. కోహ్లీ బ్యాటింగ్ విధానమే అతనికి పరుగులు ధారాళంగా రావడానికి కారణమని అన్నాడు. మియాందాద్ నుంచి ఇలాంటి ప్రశంసలు రావడంతో కోహ్లీ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News