Maruti Suzuki: మార్కెట్‌లోకి మారుతి సుజుకి స్విఫ్ట్ కొత్త మోడల్.. 5 లక్షల నుంచి ధర!

  • ఢిల్లీలోని 'ఆటో ఎక్స్‌పో-2018'లో ప్రదర్శన
  • రూ.4.99 లక్షలు-రూ.7.96 లక్షల ధరల్లో లభ్యం
  • డీజిల్, పెట్రోల్ రెండు వేరియంట్లలోనూ అందుబాటులోకి

వినియోగదారులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తోన్న సరికొత్త స్విఫ్ట్ మోడల్‌ను మారుతి సుజుకి కంపెనీ గురువారం న్యూఢిల్లీలో జరిగిన 'ఆటో ఎక్స్‌పో-2018'లో ప్రదర్శించింది. ఢిల్లీ ఎక్స్‌ షోరూమ్‌లో దీని ధర రూ.4.99 లక్షల నుండి రూ.7.96 లక్షలుగా ఉంటుందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఇది ఆరు రంగుల్లో 12 రకాల వేరియంట్లలో లభించనుంది.

 దీనికి సంబంధించిన బుకింగ్ ఈ ఏడాది జనవరిలోనే ప్రారంభమయింది. అయితే ఇది పూర్తిస్థాయిలో మార్కెట్లోకి అందుబాటులోకి రావడానికి మరో 6-8 వారాల సమయం పట్టవచ్చని అంచనా. ఈ కారు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్  ఆప్షన్లతో పాటు పెట్రోల్, డీజిల్ రెండు వేరియంట్లలోనూ లభించనుంది. కాగా, స్విఫ్ట్ తొలిసారిగా 2005లో భారత మార్కెట్‌లోకి అడుగు పెట్టింది. ఇప్పటివరకు 18 లక్షల యూనిట్లు విక్రయమయ్యాయి. భారత్‌లో విక్రయమవుతున్న ఐదు ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీల కార్లలో స్విఫ్ట్ కూడా ఒకటి కావడం గమనార్హం.

Maruti Suzuki
Swift
Auto Expo 2018
  • Loading...

More Telugu News