Congress: రేణుకా చౌదరిపై మోదీ వ్యాఖ్యలను ఖండించిన కాంగ్రెస్

  • రేణుకా చౌదరిని కించపరిచేలా మోదీ వ్యాఖ్యలు చేశారు
  • పక్షపాత ధోరణితో వ్యవహరించవద్దని వెంకయ్యనాయుడిని కోరాం
  • ఓ ట్వీట్  చేసిన కాంగ్రెస్ పార్టీ

నిన్న రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే తీర్మానంపై ప్రధాని ప్రసంగిస్తున్న సమయంలో కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి నవ్వడం.. అందుకు, నరేంద్ర మోదీ స్పందిస్తూ రామాయణం సీరియల్ తర్వాత ఇంత పెద్దనవ్వు మళ్లీ వినే భాగ్యం దక్కిందని వ్యాఖ్యానించడం తెలిసిందే. మహిళలను కించపరిచేలా మోదీ వ్యాఖ్యానించారంటూ రేణుక ప్రతిస్పందించడం విదితమే. రేణుకపై మోదీ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ ఖండించింది. ఈ మేరకు ఓ ట్వీట్ చేసింది.

రాజ్యసభ సభ్యురాలు, కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరిని కించపరిచే విధంగా మోదీ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని పేర్కొంది. పక్షపాత ధోరణితో వ్యవహరించవద్దని, సభలో సాటి సభ్యులను గౌరవించాలని రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడిని కోరామని ఆ ట్వీట్ లో కాంగ్రెస్ పార్టీ తెలిపింది. కాగా, రేణుకా చౌదరిపై మోదీ చేసిన వ్యాఖ్యలను బీజేపీ మహిళా నేత స్మృతి ఇరానీ సమర్థించారు. ‘మహిళ’ అనే దానిని అడ్డం పెట్టుకుని రేణుక తన ఇష్టానుసారం మాట్లాడితే ఎలా? అని స్మృతి ఇరానీ ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News