Pawan Kalyan: దిశానిర్దేశం చేయమని జేపీని కోరాను: ‘జనసేన’ అధినేత పవన్ కల్యాణ్
- లోక్ సత్తా అధినేతను కలిసిన జనసేన అధినేత
- రాష్ట్ర విభజన హామీలు అలానే ఉండిపోయాయి దిశానిర్దేశం చేసేందుకు ఆయన అంగీకరించారు: పవన్ కల్యాణ్
లోక్ సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణతో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ భేటీ ముగిసింది. అనంతరం, పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడుతూ, తాను ఎంతో అభిమానించే జయప్రకాశ్ నారాయణను కలిశానని, విభజన హామీలు, హోదాపై చర్చించామని చెప్పారు. రాష్ట్ర విభజన చేస్తే ఎలాంటి సమస్యలు వస్తాయనే దానిని ఆయన ముందుగానే ఆలోచించారని అన్నారు.
రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణ, ఆంధ్రాకు కేంద్రం ఏమైతే హామీలు ఇచ్చిందో, ఆ హామీలన్నీ అలాగే ఉండిపోయాయని, వాటినెవరూ సరిగ్గా ముందుకు తీసుకెళ్లలేదని అన్నారు. ఈ నేపథ్యంలో ఒక దిశా నిర్దేశం చేయవలసిందిగా ఈరోజున ఆయన్ని తాను కోరానని, అందుకు ఆయన సుముఖత వ్యక్తం చేశారని అన్నారు. ఈ రోజున ఏపీలో బంద్ కు పిలుపునిచ్చిన రాజకీయ పార్టీలకు తన ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు. కాగా, రాజకీయ జేఏసీ, పార్లమెంటులో ఎంపీల ఆందోళన వంటి అంశాలపై వీరిద్దరూ చర్చించారు.