lok sabha: లోక్ సభలో పడుకుని నిరసన వ్యక్తం చేసిన టీడీపీ ఎంపీలు!

  • కొనసాగుతున్న టీడీపీ ఎంపీల ఆందోళన
  • లోక్ సభలో పడుకుని నిరసన
  • విభజన హామీలు నెరవేర్చాలంటూ పట్టు

విభజన హామీలను నెరవేర్చాలని, ఏపీకి న్యాయం చేయాలని కోరుతూ లోక్ సభలో టీడీపీ ఎంపీలు ఆందోళన చేస్తున్నారు. ఉదయం వెల్ లోకి వెళ్లి... ఢమరుకం మోగిస్తూ, గోవిందా గోవిందా అంటూ వినూత్నరీతిలో నిరసన తెలిపిన టీడీపీ ఎంపీలు... తాజాగా సభలో పడుకుని నిరసన తెలిపారు. స్పీకర్ సుమిత్రా మహాజన్ వారిస్తున్నప్పటికీ, వారు బేఖాతరు చేస్తున్నారు. తమను సభ నుంచి సస్పెండ్ చేసినా... ఆందోళనను విరమించబోమని వారు అంటున్నారు. విభజన హామీలను అమలు చేసేంత వరకు తమ నిరసన కార్యక్రమం కొనసాగుతుందని స్పష్టం చేశారు.  

lok sabha
Telugudesam mps
protest
  • Loading...

More Telugu News