ranveer singh: రణ్ వీర్ సింగ్, దీపికా పదుకునే డెస్టినేషన్ వెడ్డింగ్?

  • ఏడాది చివరికల్లా ఒక్కటవ్వాలని భావిస్తున్న దీపికా పదుకునే, రణ్ వీర్ సింగ్
  • అత్యంత సన్నిహితుల సమక్షంలో డెస్టినేషన్ వెడ్డింగ్
  • ముంబై, బెంగళూరుల్లో రిసెప్షన్

బాలీవుడ్ ప్రేమపక్షులు రణ్ వీర్ సింగ్, దీపిక పదుకొనే జోడి వివాహంపై బీటౌన్ గుసగుసలాడుకుంటోంది. వీరి వివాహంపై గతంలోనే చాలా సందర్భాల్లో వార్తలు వచ్చినప్పటికీ ప్రేమ, పెళ్లిపై ఈ జంట ఇంతవరకు స్పందించిన సందర్భంలేదు. పెనుకలకలం రేపి సక్సెస్ సాధించిన పద్మావత్ విజయం తరువాత వీరిద్దరూ వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారని బీటౌన్ కథనం.

ఈ ఏడాది చివరికల్లా మూడుముళ్ల బంధంతో ఇద్దరూ ఒక్కటవ్వాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. అత్యంత సన్నిహితుల సమక్షంలో డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ (ఏదో ఒక దూర ప్రాంతానికి వెళ్లి పెళ్లి చేసుకోవడం) తరహాలో పెళ్లి చేసుకోవాలని భావిస్తున్నట్టుగా సోషల్ మీడియాలో వార్తలు ట్రెండ్‌ అవుతున్నాయి. వివాహానంతరం ముంబై, బెంగళూరులలో రెండు భారీ రిసెప్షన్‌ లను కూడా ప్లాన్‌ చేసినట్టు తెలుస్తోంది. దీనిపై ఈ జంట స్పందించాల్సి ఉంది. 

ranveer singh
Deepika Padukone
marriage
  • Loading...

More Telugu News