Uttar Pradesh: తాత ఆస్తిపై పెళ్లికాని మనవరాలికి హక్కు... కీలక చట్టం తేనున్న యూపీ సీఎం!

  • తండ్రిని కోల్పోయిన అవివాహిత యువతులకు తాత ఆస్తిలో హక్కు
  • యూపీ రెవెన్యూ కోడ్ సవరణ బిల్లు తయారు
  • రేపు అసెంబ్లీ ముందుకు తెస్తామన్న యోగి ఆదిత్యనాథ్

పాలనలో తనదైన ముద్ర వేస్తూ ముందుకు సాగుతున్న ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, మరో కీలక బిల్లును అసెంబ్లీ ముందుకు తేవాలని నిర్ణయించుకున్నారు. తాతలకు ఉన్న ఆస్తిపై తండ్రిని కోల్పోయి, పెళ్లికాకుండా ఉన్న మనవరాలికి కూడా హక్కు ఉండేలా సరికొత్త రెవెన్యూ కోడ్ సవరణ బిల్లును తేనున్నట్టు ఆయన స్వయంగా వెల్లడించారు. ఈ మేరకు యూపీ రెవెన్యూ కోడ్ సవరణ బిల్లును 108, 110 క్లాజుల ప్రకారం అసెంబ్లీ ముందుకు తేనున్నామని అన్నారు. ఈ బిల్లును శుక్రవారం నాడు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ప్రవేశపెడతామని స్పష్టం చేశారు.

Uttar Pradesh
Grand Father
Unmarried Grand Daughter
  • Loading...

More Telugu News