Sonia Gandhi: టీడీపీ ఎంపీలకు ఇచ్చిన మాటను నిలుపుకున్న సోనియా.. లోక్‌సభలో ఏపీ కోసం కదిలిన కాంగ్రెస్!

  • నాలుగు రోజులుగా సైలెంట్ గా ఉన్న కాంగ్రెస్
  • ఏపీ స్పెషల్ స్టేటస్ పై నేడు నోటీస్
  • టీడీపీ ఎంపీలకు ఇచ్చిన మాట నిలుపుకున్న సోనియా

లోక్ సభలో ఈరోజు ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే టీడీపీ ఎంపీలతో కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ మంతనాలు జరపడం అందరినీ ఆకట్టుకుంది. మరోవైపు, గత నాలుగు రోజులుగా ఏపీ ఎంపీలు పార్లమెంటులో ఆందోళనలు నిర్వహిస్తున్నా, ఏమాత్రం స్పందించని కాంగ్రెస్ పార్టీ... నేడు రూటు మార్చింది.

ఏపీకి మద్దతిస్తూ అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఏపీ విభజన చట్టం, హోదాపై చర్చ జరపాలంటూ లోక్ సభలో కాంగ్రెస్ పార్టీ నోటీసును ఇచ్చింది. రూల్ 184 కింద ఏపీకి స్పెషల్ స్టేటస్ పై చర్చతో పాటు ఓటింగ్ జరపాలంటూ లోక్ సభ సెక్రటరీ జనరల్ కు కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ మల్లికార్జున ఖర్గే నోటీసులు అందించారు. టీడీపీ ఎంపీలతో మంతనాల సందర్భంగా ఏపీ కోసం పోరాడతామని సోనియా హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ పార్టీ నోటీసులు ఇవ్వడం గమనార్హం.

Sonia Gandhi
Telugudesam mps
lok sabha
notice
ap special status
  • Loading...

More Telugu News