amit shah: అమిత్ షా, జైట్లీలతో భేటీ అయిన సుజనా చౌదరి

  • ఏపీ బంద్, ఆందోళనలపై ఆరా
  • పరిస్థితిని వివరించిన సుజనా చౌదరి
  • ఉభయసభల్లో కొనసాగుతున్న ఎంపీల ఆందోళన

బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీలతో కేంద్ర మంత్రి సుజనా చౌదరి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏపీలో జరుగుతున్న బంద్, ఆందోళనల గురించి సుజనా చౌదరితో వారు వాకబు చేశారు. జరుగుతున్న పరిస్థితిని వారికి సుజనా వివరించారు. ఇదే సందర్భంగా విభజన చట్టంలోని అంశాలను అమిత్ షాకు మరోసారి వివరించారు.

మరోవైపు ఏపీ ఎంపీల ఆందోళనలతో ఉభయసభలు అట్టుడికాయి. ఈ నేపథ్యంలో, రాజ్యసభను ఛైర్మన్ వెంకయ్యనాయుడు మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. లోక్ సభ మాత్రం ఆందోళనల మధ్యే కొనసాగుతోంది.

amit shah
Arun Jaitly
Sujana Chowdary
ap bandh
parliament
  • Loading...

More Telugu News