Chiranjeevi: ట్రీట్ మెంట్ కోసం విశాఖ వెళుతున్న చిరంజీవి!
- నేచురోపతి ట్రీట్ మెంట్ చేయించుకోనున్న చిరు
- శరీరం కాంతిమంతం అవుతుందట
- స్కిన్ కూడా రేడియేట్ అవుతుందట
తన 151వ చిత్రం 'సైరా' షూటింగ్ లో మెగాస్టార్ చిరంజీవి బిజీగా ఉన్నారు. ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. తాజాగా ఆయనకు సంబంధించిన ఓ వార్త వెలుగు చూసింది. ట్రీట్ మెంట్ కోసం త్వరలోనే చిరంజీవి వైజాగ్ వెళుతున్నారట. నేచురోపతి ట్రీట్ మెంట్ కోసం ఆయన అక్కడకు వెళ్లబోతున్నారు. ఈ ట్రీట్ మెంట్ చేయించుకుంటే శరీరం కాంతిమంతం అవుతుందట. స్కిన్ కూడా రేడియేట్ అవుతుందని చెబుతున్నారు. రామ్ చరణ్ నిర్మాణంలో 'సైరా' సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది.