Chandrababu: మనం ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు.. మీ పోరాటం చాలా గొప్పది: టీడీపీ ఎంపీలపై చంద్రబాబు ప్రశంసలు

  • పార్లమెంట్ లో మన ఎంపీలు బాగా పని చేశారు
  • కేసుల భయంతో వైసీపీ ఆ పని చేయలేకపోతోంది
  • మన పోరాటం జాతీయ స్థాయికి వెళ్లాలి

రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్లమెంటులో టీడీపీ ఎంపీలు చేస్తున్న పోరాటాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందించారు. ఈ ఉదయం ఆయన టీడీపీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉభయసభల్లో మన ఎంపీలు బాగా పని చేశారని కితాబిచ్చారు. ముఖ్యంగా, గల్లా జయదేవ్ ప్రసంగాన్ని ఆయన ప్రశంసించారు.

మనం ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు. ఎక్కడైనా ప్రతిపక్షం ముందుండి పోరాటం చేస్తుందని... కానీ, కేసుల భయంతో వైసీపీ ఆ పని చేయలేకపోతోందని చెప్పారు. ఉభయసభల్లో మన ఎంపీలంతా మన గళాన్ని గట్టిగా వినిపించాలని... మన పోరాటాన్ని జాతీయ స్థాయికి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. 

Chandrababu
parliament
Telugudesam mps
  • Loading...

More Telugu News