lonely bird nigel: వృద్ధాప్యంతో న్యుజిలాండ్ లో 'ఒంటరి పక్షి' మృతి!
- గ్యానెట్ జాతికి చెందిన సముద్ర పక్షి నిగెల్
- మానా ద్వీపంలో ఏర్పాటు చేసిన పక్షి బొమ్మతో ప్రేమ
- నివాసం ఏర్పరచుకుని నివసించిన నిగెల్
ప్రపంచంలోనే ఒంటరి పక్షిగా పేరుపొందిన గ్యానెట్ జాతి పక్షి న్యూజిలాండ్ లోని మానా ద్వీపంలో కన్నుమూసింది. గ్యానెట్ జాతికి చెందిన ఈ సముద్ర పక్షిని వణ్యప్రాణి సంరక్షకులు ‘నిగెల్’గా పిలుచుకుంటున్నారు. న్యూజిలాండ్ లోని మానా ద్వీపంలోకి గ్యానెట్ జాతికి చెందిన సముద్ర పక్షులను ఆకర్షించేందుకు వన్యప్రాణి సంరక్షకులు ఈ ద్వీపంలో పక్షుల బొమ్మలు, నకిలీ ఆవాసాలను ఏర్పాటు చేశారు.
వీటి పట్ల ఆకర్షణకు గురైన మూడు పక్షులు ఈ ద్వీపాన్ని క్రమంగా సందర్శిస్తున్నప్పటికీ.. ఓ బొమ్మ పక్షితో ప్రేమలో పడ్డ నిగెల్ మాత్రమే ఇక్కడ నివాసం ఏర్పరుచుకొంది. దీంతో దీనికి ఒంటరి పక్షి అనే పేరు వచ్చింది. అయితే వృద్ధాప్యంతో నిగెల్ చనిపోయినట్లు భావిస్తున్నామని పరిశోధకులు తెలిపారు. నిగెల్ మృతితో మిగతా గ్యానెట్ పక్షులు ఈ ద్వీపానికి తిరిగి వచ్చే అవకాశాలు తక్కువేనని వారు భావిస్తున్నారు.