YSRCP: కావలి సమీపంలో విద్యార్థులతో కలసి వైఎస్ జగన్ ధర్నా

  • ఏపీ బంద్ కు వైకాపా మద్దతు
  • నెల్లూరు జిల్లా దుండిగంలో విద్యార్థుల బంద్
  • వారితో జతకలిసిన వైఎస్ జగన్
  • ప్లకార్డు పట్టుకుని నినాదాలు

నేడు జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ బంద్ కు సంపూర్ణ మద్దతు తెలిపి, సంఘీభావంగా తన పాదయాత్రకు విరామం ప్రకటించిన వైకాపా అధినేత వైఎస్ జగన్, కొద్దిసేపటి క్రితం బంద్ లో పాల్గొన్నారు. కావలి సమీపంలోని ఏఎస్ పేట మండలం దుండిగంలో విద్యార్థులు బంద్ నిర్వహిస్తుండగా, జగన్ వెళ్లి వారితో కలసి ధర్నా నిర్వహించారు. విద్యార్థులు ప్లకార్డులు పట్టుకుని ఉండగా, తాను కూడా వాటిని పట్టుకుని రాష్ట్రానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ కారణంగానే రాష్ట్రానికి నిధుల్లో, ప్రాజెక్టుల్లో వాటా దక్కకుండా పోయిందని విమర్శించారు.

YSRCP
Jagan
AP Band
Kavali
Students
  • Loading...

More Telugu News