Diana Ringo: 18 అంగుళాల చిట్టి నడుము భామను చూశారా? ఇదిగో!

  • యూఎస్ మిలిటరీలో పనిచేసిన డయానా రింగో
  • మూడేళ్లుగా నడుముకు బ్యాండ్
  • సన్నగా మారిపోయిన డయానా నడుము

ఓ అందమైన యువతి నడుము కొలత ఎంత ఉండాలి? 24 అంగుళాలు ఉంటే సరిపోతుందని చెబుతుంటారు. కానీ, ఇద్దరు పిల్లలకు తల్లి అయ్యుండి కూడా అమెరికాకు చెందిన డయానా రింగో అనే యువతి కేవలం 18 అంగుళాల నడుమును మెయిన్ టెయిన్ చేస్తూ, ప్రపంచమంతటినీ ఆకర్షిస్తోంది. గతంలో యూఎస్ మిలిటరీలో పని చేసిన ఆమె, పిల్లలు పుట్టిన తరువాత కూడా ఫిట్ నెస్ కోసం ప్రయత్నిస్తూ, గత మూడేళ్లుగా నిత్యమూ 23 గంటల పాటు ఒక బ్యాండ్ ను తన నడుము చుట్టూ గట్టిగా కట్టుకుని ఉండటంతో, ఆమె నడుము ఎవరూ ఊహించనంత సన్నగా మారిపోయింది.

తొలుత ఆమె తీరును వ్యతిరేకించిన కుటుంబీకులు, వైద్యుల వద్దకు తీసుకెళ్లిన తరువాత మనసు మార్చుకున్నారు. ఆమె ఆరోగ్యం భేషుగ్గా ఉందని డాక్టర్లు స్పష్టం చేయడంతో భర్త బ్రెట్ ఇప్పుడు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాడు. తన నడుము ఇలాగే సన్నగా ఉండేలా చూసుకోవడం తనకు ఇష్టమని డయానా చెబుతోంది. ఇక చూపరులకు ఆమె శరీరం తీరుతెన్నులు ఓ లేడీ కార్టూన్ క్యారెక్టర్ గా కనిపిస్తుండటం గమనార్హం. డయానా చిట్టి నడుము వీడియోను మీరూ చూడవచ్చు.

Diana Ringo
18 Inches
Belt
USA
  • Error fetching data: Network response was not ok

More Telugu News